భార్యను కాపురానికి పంపుతలేడని, మామపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

Warangal Bureau
1 Min Read
  • మద్యం మత్తులో మామపై కత్తితో దాడి చేసిన అల్లుడు

వరంగల్ సిటీ, డిసెంబర్ 03(ప్రజాజ్యోతి):

భార్యను కాపురానికి పంపడం లేదని కోపంతో పిల్లనిచ్చిన మామపై కత్తితో దాడి చేశాడు ఓ ప్రబుద్ధుడు.. వివరాలలోకెళితే వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామన్నపేట బొడ్రాయి ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి రవీందర్(55) అనే వ్యక్తిపై అతని అల్లుడు అనిల్ రెడ్డి(31) కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ నిమిత్తం రవీందర్ అల్లుడిని కత్తితో పొడిచాడు. ఈ దాడిలో మామ అల్లుళ్ళు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న వరంగల్ ఏ.ఎస్.పి శుభం ప్రకాష్, మట్టేవాడ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి తీవ్రంగా గాయపడిన మామా అల్లుళ్లను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇద్దరి పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారని సమాచారం. కేసు నమోదు చేసిన మట్టేవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *