- ‘మీ సేవ’ లు ప్రజలకు చేరువ కావాలి..
- ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు భారంగా మారాయి
- తెలంగాణ మీసేవ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల రావిపాటి దేవేందర్ రావు
వాట్సాప్ మీసేవ సర్వీసుల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుందని నిపుణులు చెపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం తో మీ సేవ లు ప్రజలకు భారంగా మారనున్నాయని తెలంగాణ మీసేవ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రావిపాటి దేవేందర్ రావు పేర్కొన్నారు.
ప్రజల్లో అవగాహన లోపం వల్ల ఇలాంటి కొత్త ప్రయోగాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు . ఇంతకు ముందుగా ఆన్లైన్ సేవలను నేరుగా ప్రజలకు అందించే విధంగా చేశారు కానీ జరిగే మొత్తం సేవలలో రెండు శాతం మాత్రమే ఉంది.
ఎప్పుడు వచ్చిన వాట్సాప్ సేవల వల్ల కేవలం 0.5% వరకు ప్రజలు నేరుగా వినియోగించుకుని అవకాశం ఉండవచ్చు దీనికోసం కొట్టాది రూపాయల ప్రజాధనాన్ని వ్యర్ధం చేసే బదులు ఉన్న మా మీ సేవ కేంద్రాల బలోపేతానికి కృషిచేసి మరింత మెరుగ్గా సేవలను అందించే విధంగా చేసినట్లయితే పౌరులకు మరింత మేలు చేసినట్లు అవుతుంది.
వాట్సాప్ లో అప్లై చేసినప్పటికీ మళ్లీ దాన్ని ప్రింట్ కోసం మీసేవ కేంద్రానికి వెళ్లాలి లేదా పోస్టు ద్వారా పొందే వీలుంది కానీ మన పోస్ట్ ద్వారా వచ్చే సమయం ఎంత పడుతుంది అనేది పెద్ద ప్రశ్న పైగా పోస్టు ద్వారా సర్టిఫికెట్ పొందడానికి అధిక చార్జీలు ఉన్నాయి.
ఇలాంటి సరికొత్త విధానాలు ఆలోచనలతో ప్రభుత్వం ఇలాంటి ప్రయోగాలు చేయడం ద్వారా సామాన్య పౌరుల కంటే ఎక్కువగా మధ్య దళారులు అమాయక ప్రజలను తప్పుదారి పట్టించే దళారులు వ్యక్తులు ఎక్కువగా ఉపయోగించుకొని డబ్బు దండుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మేం సంబంధించిన అధికారులకు సోదాహరణంగా వివరించడం జరిగింది.
మన పౌరుల అవగాహన మేరకు ఉత్తమమైన వ్యవస్థగా ఉన్న మీసేవ కేంద్రాలను ఆర్థికంగా సాంకేతికంగా బలోపేతం చేయడం అనేది ఉత్తమమైన మార్గం ఈ మార్గంలో ఆలోచన చేయడం ఉత్తమమైనది తద్వారా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందుతాయని మా అభిప్రాయం వ్యక్తం చేశారు.

