- కామారం గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటు
ఆత్మకూరు, నవంబర్ 24 (ప్రజాజ్యోతి):
ఆత్మకూరు మండలంలోని కామారం గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఐపీఎస్ అంకిత్ కుమార్ చేతుల మీదుగా 16 సిసి టివి కెమెరాలు ప్రారంభోత్సవం చేశారు. సిసి కెమెరాల ఏర్పాటులో సిఐ సంతోష్ ప్రత్యేక చొరవ తీసుకొని కామారం గ్రామానికి చెందిన గ్రామస్తులు రుద్ర ఓవర్సీస్ అధినేత మూల మధుకర్, లక్కర్సు రాజు సహకారంతో కెమెరాల ఏర్పాటు చేశారు. అనంతరం డీసీపీ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సందర్శించి, రికార్డులను పరిశీలించారు.

