- వందేమాతరం గీతం మన జాతీయ చైతన్యానికి ప్రతీక
- నల్లబెల్లి తహసిల్దార్ ముప్పు కృష్ణ
నల్లబెల్లి/నవంబర్ 7( ప్రజా జ్యోతి ):
వందేమాతరం గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్లబెల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.00 గంటలకు వందేమాతరం గీతాన్ని ఘనంగా ఆలపించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముప్పు కృష్ణ నేతృత్వంలో కార్యాలయ సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్. సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ముప్పు కృష్ణ మాట్లాడుతూ, వందేమాతరం గీతం మన జాతీయ చైతన్యానికి ప్రతీక. దేశభక్తిని, ఐక్యతను ప్రతిబింబించే ఈ గీతం తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా కొనసాగాలని అన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అన్ని శాఖల సిబ్బందికి తహసీల్దార్ ముప్పు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
