అక్రిడిటేషన్ ఉంటేనే జర్నలిస్టుల..?
— తోటి పత్రిక విలేఖరుల పై చిన్న చూపు
— ఆర్ ఎన్ ఐ గుర్తింపు కు ప్రాధాన్యం లేదా
— అక్రిడేషన్ ఉంటేనే ప్రామాణికమా..?
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 24 (ప్రజాజ్యోతి)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆ మండల కేంద్రంలోని కొందరు విలేకరులు చిన్న చూపు చూడడం ఎంత వరకు సమంజసం ముఖ్యంగా అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టు లు అనే ప్రచారం చేస్తున్న ఆ నాలుగు ఐదు పత్రికల రిపోర్టర్లు,మిగతా తోటి పత్రిక విలేకరులను చిన్న చూపు చూస్తున్నారు. ముఖ్యంగా అక్రిడేషన్ అనేది ఒక జర్నలిస్టుకు ప్రభుత్వం కల్పిస్తున్న కొన్ని సదుపాయాలు మాత్రమే వర్తిస్తాయని ఆ మాత్రం తెలవదా..? అక్రిడేషన్ అనేది ఒక ఐడెంటిటీ మాత్రమే బస్సు పాస్ కొరకు, హెల్త్ కార్డు కొరకు, కొన్ని మౌలిక సదుపాయాల కొరకు జిల్లా కలెక్టర్ ఇస్తున్న గుర్తింపు కార్డు, ఈ యొక్క కార్డును పొందిన కొందరు విలేకరులు మిగతా తోటి పత్రికా విలేకరులను అవహేళన చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు ఆర్ఎన్ఐ కు ప్రాధాన్యం లేదా..? ఇట్టి గుర్తింపును పత్రికలకు ప్రభుత్వం జారీ చేస్తుందని ప్రతి ఒక్క జర్నలిస్టులకు తెలుసు అయినా కూడా కొందరు విలేకరులు దురుసుగా ప్రవర్తిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క నాలుగైదు పత్రికల రిపోర్టర్లు అజమాయిషి, ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి అదేవిధంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రెస్ గ్రూపుల నుండి తొలగించడం పెత్తనం చేస్తున్నారు. మరియు ప్రభుత్వ అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నట్టు సమాచారం. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కొందరు పత్రికా విలేకరులు మండిపడుతున్నారు. ఇకనైనా వారి ప్రవర్తన మార్చుకుని ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న తోటి పత్రిక రిపోర్టర్లను చిన్నచూపు చూపడం మానుకోవాలని పత్రికా ముఖంగా తెలపడం జరుగుతుంది.
