- భజన మండలి సభ్యులకు చీరల పంపిణి
దామెర, సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి):
దామెర మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన పద్మావతి భజన మండలి సభ్యులకు కాంగ్రెస్ మండల మహిళా ఉపాధ్యక్షురాలు కచ్చకాయాల అరుణ రవీందర్ చీరలు అందించారు. కాంగ్రెస్ మండల మహిళా ఉపాధ్యక్షురాలు కచ్చకాయాల అరుణ రవీందర్ దంపతుల సౌజన్యంతో భజన మండలి సభ్యులకు చీరలు అందించారు. భజన మండలి మహిళా సభ్యులు తిరుపతి తదితర ఆలయాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా భజన మండలి సభ్యులు అరుణ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.
