హనుమకొండ జిల్లా ప్రతినిధి / ప్రజాజ్యోతి::
మీ సేవ కేంద్రం పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తి పై కేసు నమోదయ్యింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాలపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆత్మకూరు మండలం కామారం గ్రామానికి చెందిన మూల మధుకర్ అనే వ్యక్తి మీ సేవ కేంద్ర ఆపరేటర్ పై నిరాధారణ ఆరోపణలు చేస్తూ.. మీ సేవ కేంద్రాన్ని వ్యక్తి గత ప్రయోజనాలకు అడ్డాగా మార్చుకొని, దందా చేస్తున్నాడని సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. రిపోర్టర్ గా కొనసాగుతూ 2011 సంవత్సరంలో APPSC ద్వారా నియమించిన VRA రిజర్వేషన్స్ లో మార్పులు చేసాడని తప్పుడు ప్రచారాన్ని గ్రామంలోని కొందరికి వాట్సప్ ద్వారా పంపించాడు. ఆ సమయంలో మీసేవలు అందుబాటులోకి రాలేదు, సదరు మీ సేవ నిర్వాహకుడు రిపోర్టర్ గా ఏ సంస్థలో నియమించ బడలేదు. వివిధ సామాజిక వర్గాలను కులాలను రెచ్చ గొడుతూ అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తూ కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టు లు పెట్టడంతో సదరు నిర్వాహకుడు పోలీసులను ఆశ్రాయించాడు.