తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటన ప్రకారం రేపు అనగా శుక్రవారం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు
