గాంధారి, ఆగస్టు 19(ప్రజాజ్యోతి)
గాంధారి మండల కేంద్రంలో మంగళవారం రోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డేను ఘనంగా నిర్వహించారు. గాంధారి మండల ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – ఫోటోగ్రఫీ కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా, సమాజానికి అద్దం పట్టే కళ అని తెలిపారు. ఫోటో ఒక క్షణాన్ని శాశ్వతంగా నిలుపుతూ, తరాల తరబడి గుర్తు చేసుకునే విధంగా చేస్తుందని చెప్పారు.సమాజంలో జరుగుతున్న సంఘటనలను నిజానిజాలుగా ప్రజల ముందుకు తీసుకువచ్చే శక్తి ఫోటోగ్రఫీకి ఉందని వివరించారు.ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఫోటోగ్రఫీ ప్రాధాన్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒక్కరు ఫోటోలు తీయగలిగే స్థాయికి చేరుకున్నా, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కృషి మాత్రం ప్రత్యేకమైందని యూనియన్ సభ్యులు అభిప్రాయపడ్డారు.అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డేను జరుపుకుంటున్న నేపథ్యంలో, ఈ రోజును స్ఫూర్తిగా తీసుకుని యువత ఫోటోగ్రఫీ రంగంలో మరింత ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమం లో ప్రభు, రమేష్,నవీన్,లాభాన రాము, స్వామి, రాకేష్, తదితరులు పాల్గొన్నారు