బీసీ రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తున్నాం
- # కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే వెనక్కి తీసుకోదు
# ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన
సిద్ధిపేట ప్రజాజ్యోతి:
కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాట మేరకు 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తున్నాం అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో 14వ మున్సిపల్ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆలకుంట మహేందర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజకు సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఇంటి కలను సాకారం చేస్తున్న మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లిస్టులో పేరు రానివారు ఆందోళన పడవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం అని అన్నారు. గతంలో డబుల్ ఇల్లు ఇస్తామని చెప్పి కెసిఆర్ మాయమాటలు చెప్పి కాలయాపన చేశారు అని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఆయన కుటుంబం సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోలేదు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం పెంచుకున్నారు అని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు అని అన్నారు. అప్పుల రాష్ట్రంగా తెలంగాణను కెసిఆర్ మార్చారని కానీ ఆ అప్పులను చెల్లిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అని అన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కుల గణన చేసి దేశానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదర్శంగా నిలిచారు అని అన్నారు. ఎంత కష్టమైనా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు రాష్ట్రంలో దాడులు అలజడి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు అని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న దొంగ డ్రామాలు నాటకాలను ప్రజలు నమ్మవద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దం లక్ష్మి గయాజుద్దీన్ సనా రజిత వల్లపు శ్రీకాంత్ రాకేష్ సాయి ప్రతాప్ తదితరులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు