ఎల్లారెడ్డి జూలై 11 (ప్రజా జ్యోతి)
ఎల్లారెడ్డి సీఐగా రాజారెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రవీందర్ నాయక్ డీజీపీ ఆఫీస్ కు అటాచ్ కావడంతో ఆ స్థానంలో మెదక్ జిల్లా సీసీఎస్‌లో పనిచేస్తున్న రాజారెడ్డిను నియమించారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలుచేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు ఎస్‌ఐ బొజ్జ మహేష్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఎల్లారెడ్డి సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజారెడ్డి

Leave a Comment