మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో హనుమాన్ విగ్రహం విధ్వంసం జరిగిన సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులతో కలిసి ఆలయాన్ని సందర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు దారుణ ఘటనపై బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణను వేగవంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఇటువంటి అసభ్య చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ స్పష్టం చేశారు.