నిరుపేదలకు సొంతింటి కలే లక్ష్యం -నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం
నిడమనూరు,జూన్ 24(ప్రజాజ్యోతి): నిరుపేదలకు సొంతింటి కలే లక్ష్యమని నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు.మంగళవారం మండలంలోని మార్లగడ్డ క్యాంపు గ్రామంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి గారి సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు ప్రతి నిరుపేద కుటుంబానికి వెలుగు నింపుతుందన్నారు.
అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రం అందజేశారు . అదేవిధంగా మండలంలోని పార్వతీపురం గ్రామ పంచాయతీ కార్యాలయానికి సొంత ఖర్చుతో కుర్చీలు నిడమానూరు మార్కెట్ చైర్మన్ అంకతిసత్యం బహుకరించారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాసరెడ్డి,పిసిసి డెలికేటెడ్ ముంగి శివ మారయ్య గారు,గ్రామ కార్యదర్శి బెజవాడ సతీష్, ఉమ్మడి వల్లభ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఉమ్మడి ఆనంద్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సభావత్ శ్రీను,ఇంజం ప్రతాప్ రెడ్డి,ధారవత్ భాస్కర్,సభావత్ నగేష్,
గోవిందు,రాము,వెంకటరెడ్డి,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.