హైదరాబాద్, నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. అత్యవసర విభాగంలోని ఐదో అంతస్తులో మంటలు వచ్చాయి. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో ఆసుపత్రిలో ఉన్న వారు అందరూ బయటకు పరుగు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.