ఇప్పుడు ఈ కారు ట్రెండింగ్… ఏఆర్ రెహమాన్ కూడా కొనేశాడు!

V. Sai Krishna Reddy
1 Min Read

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధోరణి కొనసాగుతున్న విషయం విదితమే. పెట్రోల్, డీజిల్ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాహనాల కాలుష్యాన్ని నివారించేందుకు చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఒక ఖరీదైన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 9 మోడల్ కారును కొనుగోలు చేసిన ఆయన, ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. దీని ధర సుమారు 25 నుంచి 35 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

అయితే, రెహమాన్ మహీంద్రా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం వెనుక మార్కెటింగ్ ప్రయోజనం కూడా ఉందని భావిస్తున్నారు. ఈ మోడల్‌తో పాటు బీఎస్ 6 మోడల్ కారులో సౌండింగ్ కోసం రెహమాన్ పనిచేశారు. రెహమాన్ తాను కొనుగోలు చేసిన కారులో డాల్బీ అట్మాస్ సౌండింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *