ఆత్మకూరు, మార్చి 22 (ప్రజాజ్యోతి):
వీకెండ్ పార్టీ ప్రాణం తీసిందా..? రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి..వీకెండ్ పార్టీ కి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడు శివారు ప్రాంతంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థి స్పాట్లో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో వస్తున్న.. ట్రాక్టర్ ను ఢీ కొట్టి బి. టెక్ విద్యార్థి బుర్ర రంజిత్ కుమార్ (21) మృతి చెందాడు. జాతీయ రహదారిపై ట్రాక్టర్ వే బ్రిడ్జి కాంటా వేసుకొని , రహదారి దాటుతున్న క్రమంలో ట్రాక్టర్ ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం పై యువకుడితో అతని స్నేహితురాలు మరో యువతి ప్రయాణం చేస్తుంది.. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి స్వస్థలం హుస్నాబాద్ దగ్గర రేగొండ, పర్యాటక ప్రదేశాలు చూసుకొని వస్తుండగా ఘటన జరిగింది.