విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం అంశం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా, ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపింది. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఆధార్, ఓటరు కార్డు సాంకేతిక నిపుణుల సంప్రదింపుల కమిటీ భేటీ కానుంది.
ఆధార్ తో ఓటరు కార్డు లింక్ చేయడంపై నేడు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శి… ఆధార్, ఓటరు కార్డు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.