తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే
ఒకటి నిధులు రాష్ట్రానికి రావాలి.. రెండూ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలి. ఈ రెండు టార్గెట్లతోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రులను కలుస్తున్నాడా? అంటే ఔను అనే అసెంబ్లీలో నర్మగర్భంగా బయటపెట్టారు. బీఆర్ఎస్ పై ఒంటికాలిపై లేస్తున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని చావుదెబ్బ తీయడానికి కేంద్రంలోని పెద్దల సాయం కోరుతున్నట్టుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. ఢిల్లీలో టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతికి గల కారణాలు.. ఆయన పెట్టుబడులపై ఆరాతీసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించాడన్న వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డినే అసెంబ్లీ వేదికగా బయటపెట్టడంతో అంతకుమించిన స్కెచ్ ఏదో రేవంత్ రెడ్డి వేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాను ఢిల్లీకి వెళ్లిన మాట నిజమేనని, అంతేకాదు రానున్న రోజుల్లో వందలసార్లు కూడా వెళ్తానని రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. తాను ఢిల్లీకి వెళ్లేది కేవలం సరదాగా కాదని, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలవడానికేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీ వెళ్తున్నానని, అక్కడ కలవని కేంద్ర మంత్రి లేరని రేవంత్ చెప్పారు. అంటే, రాష్ట్రానికి నిధులతో సంబంధం లేని మంత్రులను కూడా ఆయన కలుస్తున్నట్లు తేలిపోయింది. ఈ పర్యటనల్లో నిధులతో పాటు, ఒక కీలకమైన రహస్యాన్ని కూడా రేవంత్ వెలికి తీసినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి