హయగ్రీవ సంస్థకు భూకేటాయింపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

V. Sai Krishna Reddy
1 Min Read

విశాఖపట్నంలోని హయగ్రీవ సంస్థకు భూముల కేటాయింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థకు చేసిన భూకేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్‌కు 12.41 ఎకరాల భూములను కేటాయించగా, దీనిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే భూములను స్వాధీనం చేసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది.

2008లో హయగ్రీవ సంస్థకు ప్రభుత్వం భూములను కేటాయించింది. వృద్ధులకు, అనాథలకు కాటేజీల నిర్మాణం కోసం దీనిని కేటాయించింది. పదిహేనేళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలకపోవడంతో ప్రభుత్వం కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *