హైదరాబాద్ నగరంలోని బహదూర్పురా ప్రాంతంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లారీ మెకానిక్ వర్క్ షాప్లో మంటలు చెలరేగడంతో అవి సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
అలాగే, ఆ పక్కనే పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి కూడా మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన పోలీసులు భవనంలోని వారిని సురక్షితంగా బయటకు తరలించారు. అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గతంలో కూడా ఇదే మెకానిక్ వర్క్ షాప్లో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.