తెలంగాణ మంత్రి కొండా సురేఖ విషాదానికి గురయ్యారు. ఆమె నివాసంలో పెంపుడు కుక్క మృతి చెందడమే అందుకు కారణం. హ్యాపీ అనే పేరు గల ఆ శునకం హార్ట్ ఫెయిల్యూర్ తో ప్రాణాలు విడిచింది. తమ ఇంట్లో ఒకరిగా కలిసిపోయిన ఆ శునకం విగతజీవురాలిగా పడి ఉండడాన్ని మంత్రి కొండా సురేఖ చూసి తట్టుకోలేకపోయారు. భోరున విలపించారు. కుక్క మృతదేహంపై పూలు చల్లి నివాళి అర్పించారు. అనంతరం దానికి అంతిమసంస్కారాలు నిర్వహించారు.