రీల్స్ కోసం యువత విపరీత చేష్టలకు, ప్రాణాంతక సాహసాలకు పాల్పడుతుండడం తెలిసిందే. రీల్స్ మోజులో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
తాజాగా పాట్నాలో ఓ యూట్యూబర్ రీల్ కోసం వెధవ పని చేశాడు. స్టేషన్ లో రైలు కదులుతుండగా… కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్ తో కొట్టించాడు. దాన్ని వీడియో తీశాడు.
సదరు ప్రయాణికుడు ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందాడు. ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు దృష్టికి తీసుకెళ్లడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించిన పోలీసులు యూట్యూబర్ రితేష్ కుమార్ ను, అతడి ఫ్రెండ్ ను అరెస్ట్ చేశారు. ఆ యూట్యూబర్ తో క్షమాపణ చెప్పించి వీడియో చిత్రీకరించారు. వ్యూస్ కోసమే ఇలా చేశామంటూ ఆ యూట్యూబర్ వెల్లడించాడు