వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్ పోర్టుకు మహర్దశ పట్టింది. ఈ విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఎయిర్ పోర్ట్ అభివృద్ధి, కార్యకలాపాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్రం అనుమతి లేఖ ఇచ్చింది.
మామునూరు ఎయిర్ పోర్టు… హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)కి కూడా కేంద్రం ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజా అనుమతులు మంజూరు చేశారు.
కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండరాదని గతంలో జీఎంఆర్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి, రామ్ మోహన్ నాయుడు చొరవతో జీఎంఆర్ గ్రూప్ మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అంగీకరించింది.
ఈ క్రమంలో, మామునూరు ఎయిర్ పోర్టు పనులకు అనుమతి ఇచ్చింది. విమానశ్రయ పనులు త్వరగా చేపట్టాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి కేంద్ర మం