* స్థానిక పోరుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
* కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి
దామెర, ఫిబ్రవరి 28 (ప్రజాజ్యోతి):
ఆరు గ్యారంటీల అమలును ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మండల పార్టీ అధ్యక్షులు మన్నెం ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సీతారాంపురం, దుర్గంపేట గ్రామాలలో సమావేశం నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పాలన ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి, గ్రామాల్లో కావలసిన పనుల గురించి మరియు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగనన చేసినందుకు ఆ గ్రామ ప్రజలు ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. స్థానిక పోరుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేపాక శ్రీనివాస్, జిల్లా నాయకులు గుడిపాటి శ్రీధర్ రెడ్డి, సదిరం పోచయ్య, జక్కుల రవీందర్, దూరిశెట్టి బిక్షపతి, కూనమళ్ళ రవీందర్, మండల యూత్ అధ్యక్షులు నల్ల సుధాకర్, సీతారాంపురం గ్రామం బొమ్మినేని మల్లారెడ్డి, బాబు, అనిల్, రాజు యాదవ్, మాజీ ఉపసర్పంచ్ కావట్టి రవి, తుత్తూరు ముత్తయ్య, దుర్గం పేట గ్రామం గ్రామ దాసి శ్రీకాంత్, లింగారెడ్డి, ఆవల రవీందర్, నర్సిరెడ్డి, ముత్యాల జగన్, గజ్జల కరుణాకర్, కూనమల్ల దశరథం, ప్రకాష్, ముద్ర కోల బిక్షపతి, సలేంద్ర పృద్వి, గడ్డం సదానందం, శిల్లా ఎల్లా స్వామి, రామదాస్, ముదురుకోల పాష, రవి, శ్రీను ఎండి చోటా మియా, పెద్ద రాజు తదితరులు పాల్గొన్నారు.