దామెర, ఫిబ్రవరి 28 (ప్రజాజ్యోతి):
డిస్నీల్యాండ్ లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. శుక్రవారం దామెర మండలం ఒగ్లాపూర్ లోని డిస్నీల్యాండ్ ఇ-టెక్నో ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకున్నారు. సైన్స్ డే ను పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను పాఠశాల సైన్స్ ఉపాధ్యాయ బృందం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా 249 సైన్స్ ఎగ్జిబిట్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు వారు చేసిన ఎగ్జిబిట్ ల గురించి ఎంతో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దయ్యాల మల్లయ్య చీఫ్ అడ్వైజర్ మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి, సైన్స్ అభివృద్ధికి ఇలాంటి సైన్స్ ఫెయిర్లు ఎంతో దోహదపడతాయని విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయని అన్నారు. ముఖ్య సలహాదారులు దయ్యాల సదయ్య మాట్లాడుతూ.. సివి రామన్ భౌతిక శాస్త్రానికి కాంతి పుంజమైన రామన్ ఎఫెక్ట్ను కనుగొనడం మన భారతదేశానికి ఎంతో గర్వ కారణమని తెలిపారు. ఫిబ్రవరి 28వ రోజున రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నాడని, 1930వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించిందని మన భారత ప్రభుత్వం 1986 నుండి జాతీయ సైన్స్ డే ను జరుపుతున్నదని విద్యార్థులు ప్రతిదీ పరిశీలన చేస్తూ చూడాలని, శాస్త్రవేత్తలుగా ఎదగాలని కొనియాడారు. బాలుగు లక్ష్మీనివాసం ముఖ్య సలహాదారులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో సైన్స్ కు సంబంధించిన కోర్సులను విద్యార్థులు చదివి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనాటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బాలుగు శోభారాణి, దయ్యాల రాకేష్ భాను మరియు దయ్యాల దినేష్ చందర్ పాల్గొని విద్యార్థుల కృషిని మరి అందుకు సహకరించిన గైడ్ టీచర్లను ప్రశంసించారు. సైన్స్ ఉపాధ్యాయులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిర్ణయించనైనది. విజేతలుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. ఎంతో అట్టహాసంగా ఈనాటి సైన్స్ ఫెయిర్ విజయవంతం కావటానికి కృషి చేసిన సైన్స్ ఉపాధ్యాయులు ఎస్. శివాజీ, సి.హెచ్. ప్రసాద్, సి.హెచ్. మధు, ఎం. రాజిరెడ్డి,ఎం.సురేష్ బాబు, ఎం. రవి కుమార్, జయలక్ష్మి, ఎన్.భవ్య, అర్షియా ను పాఠశాల యాజమాన్యం ప్రశంసించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.