మిర్చి రైతులకు శుభవార్త…. చంద్రబాబు లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్రం

V. Sai Krishna Reddy
1 Min Read

ఏపీ మిర్చి రైతుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ మిర్చి రైతుల అంశంపై మాట్లాడారు.

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. ఏపీ మిర్చి రైతుల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ఈ మేరకు మిర్చికి ధరను ప్రకటించింది. ఈ ధరను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరించనున్నాయి.

కాగా, ఏపీ నుంచి 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు కేంద్రం అవకాశం కల్పించింది. 2024-25 సీజన్ లో పండిన మిర్చికి వర్తించేలా తాజా ఉత్తర్వులు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలుస్తోంది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *