శనివారం రోజు ఉదయం పర్వతగిరి ప్రొవైషనరి ఎస్సై కళ్యాణ్ మరియు మండలం రెవెన్యూ అధికారులతో కలిసి పర్వతగిరి మండలం ఆకేరు పరివాహక ప్రాంతాల్లో కల్లెడ, రోలకల్, నారాయణపురం ,చెరువు ముందు తండా లో గల అక్రమ ఇసుక రవాణా డంపులను సందర్శించారు. ఈ సందర్భంగా పర్వతగిరి ఎస్ ఐ భోగం ప్రవీణ్ మాట్లాడుతూ ఆకేరు వాగులో గాని లేదా వారి పట్టా భూములలో కానీ అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అక్రమంగా ఇసుక తరలించే వారిని హెచ్చరించడం జరిగిందని తెలిపారు.