పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృత్యువాత పడుతుండడం, జనాలు చికెన్ తినాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఏర్పడడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
బర్డ్ ప్లూపై తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు.
రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉంటే… 5.42 లక్షల కోళ్లు చనిపోయాయని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. భోపాల్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చాక పటిష్ట చర్యలు చేపట్టామని వారు వివరించారు. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల బర్డ్ ఫ్లూ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని… ఎండలు పెరిగే కొద్దీ వ్యాధి వ్యాపించడం తగ్గుతుందని తెలిపారు. పౌల్ట్రీల్లో సరైన పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల వ్యాధి వచ్చిందని నిర్ధారించారు.
అందుకు సీఎం చంద్రబాబు స్పందిస్తూ, ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు