మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం: రేవంత్ రెడ్డికి మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. మిమ్మల్ని కలవడానికి సమయాన్ని కేటాయించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని మంద కృష్ణ స్వాగతించారు.

జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆ లోపాల వల్ల కొన్ని కులాల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నివేదికపై చర్చించి సూచనలు చేసేందుకు తాము ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటున్నట్లు మంద కృష్ణ వెల్లడించారు. వీలైనంత త్వరగా తమకు సమయం కేటాయించాలని కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *