30 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి?
పల్నాడు జిల్లా లో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
అనంతరం కేసు నమోదు చేసుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 25, 30,మంది మహిళా కూలీలు ఉన్నట్లు సమాచారం.