కాకినాడలో 1.2 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్
కాకినాడలో భారీ పెట్టుబడులు పెడుతున్న నార్వేకు చెందిన క్రౌన్ LNG సంస్థ.. రాబోయే సంవత్సరాల్లో 1.2 బిలియన్ డాలర్ల ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. కాకినాడ తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భారత్లో మొట్టమొదటి గ్రావిటీ బేస్డ్ స్టోరేజ్ & రీగ్యాసిఫికేషన్ యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. 7.2 మిలియన్ టన్నుల రీ గ్యాసిఫికేషన్ సామర్థ్యంతో టెర్మినల్ అందుబాటులోకి రానుంది.