వైసీపీ సెంట్రల్ ఆఫీస్కు పోలీసుల నోటీసులు
తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఆఫీస్(జగన్ నివాసం కూడా అదే) వద్ద అగ్ని ప్రమాదం జరగగా అక్కడి CC ఫుటేజీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తుకు ఫుటేజీ కీలకమని భావిస్తున్నారు. అటు అగ్ని ప్రమాదం నేపథ్యంలో జగన్ భద్రతపై YCP ఆందోళన వ్యక్తం చేయగా, వాళ్లే తగలబెట్టుకొని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని TDP మండిపడింది.