భారీ ఎన్ కౌంటర్.. పెరిగిన మృతుల సంఖ్య
ఛత్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 31కి చేరింది. జిల్లాలోని నేషనల్ పార్క్ దగ్గర మావోయిస్టులకు-భద్రతా బలగాలకు ఎన్కౌంటర్ జరిగినట్లు బస్తర్ ఏరియా ఐజీ వెల్లడించారు. మావోల ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.