ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేదు: సీఎం
TG: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని CM రేవంత్ వెల్లడించారు. ‘క్యాబినెట్లో ఎవరు ఉండాలో అధిష్ఠానానిదే నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించట్లేదు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తాం. త్వరగా అరెస్ట్ చేయించి జైలులో వేయాలనే ఆలోచన లేదు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా పని. పనిచేసుకుంటూ పోవడమే తెలుసు. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు’ అని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు.