తండేల్ తెలుగు మూవీ రివ్యూ

V. Sai Krishna Reddy
1 Min Read

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా అభిరుచి గల నిర్మాత బన్నీ వాసు నిర్మించిన చిత్రం తండేల్. ప్రేమ కథగా, దేశభక్తిని రగిలించే కథతో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు.

ఉత్తరాంధ్ర జాలరు కథగా రూపొందిన ఈ సినిమాలో యువ సామ్రాట్ నాగచైతన్య, టాలెంటెడ్ యాక్టర్ సాయిపల్లవి జంటగా నటించారు. ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్స్ అనంతరం నెటిజన్లు అభిమానులు వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

నాగచైతన్య యాక్టింగ్ సూపర్‌గా ఉంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొంటాడు. ప్రీ క్లైమాక్స్‌లో నాగచైతన్య క్యారెక్టర్ గురించి పాకిస్థానీ పోలీసులు ఇచ్చే ఎలివేషన్ బాగుంది. వాడు రాడు ఎందుకంటే.. ప్రాంతం ఏదైనా ప్లేస్ ఏదైనా వాడు తండేల్ అనే డైలాగ్ అదిరిపోయింది. ఆ సీన్‌కు డీఎస్పీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ వస్తాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.                                        తండేల్ సినిమా బాగుంది. మధ్యలో ఎమోషన్స్‌తో సాగదీశారనిపిస్తుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించేలా ఉంది. ఈ సినిమాలో నాగచైతన్య సర్‌ప్రైజింగ్ ఫ్యాక్టర్‌గా అనిపించాడు. అతడు కెరీర్ బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు అని నెటిజన్ తన రివ్యూను ఇచ్చాడు.    తండేల్ సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్టు ఈ సినిమాకు తోపులా అనిపించింది. ఎవరూ ఊహించని విధంగా ఎపిసోడ్ ఉంటుంది. పాటలు చాలా బాగున్నాయి. సాయిపల్లవి యాక్టింగ్ మాత్రం తోపుగా ఉంది. నాగచైతన్య పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *