10, 20 రూపాయల నాణేలు, నోట్లను నిలిపివేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి. ఈ మధ్య కరెన్సీ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం రూ.500 నోట్లు నకిలీవి మార్కెట్ లోకి వచ్చాయని, అందువల్ల ఆర్బీఐ వాటిని బ్యాన్ చేస్తోందని వార్త వైరల్ అయ్యింది. అదేవిధంగా రూ.350 నోట్లు ఆర్బీఐ ప్రింట్ చేస్తోందన్న విషయం బాగా వైరల్ అయ్యింది. ఇలాంటి అనేక వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.