ఢిల్లీలో అధికారం చేపట్టిన జాతీయేతర పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుంది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.ఢిల్లీలో అధికారం చేపట్టిన జాతీయేతర పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుంది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తొలిసారి కంటే.. రెండో సారి మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 69 స్థానాలను గుండుగుత్తగా దక్కించుకుని.. పగ్గాలు చేపట్టిన ఆప్.. తాజాగా జరిగిన ఎన్నికల పోలింగ్‌లో వెనుకబడిపోయిందని సర్వేలు చాటుతున్నాయి. దిగ్గజ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు సైతం.. ఆప్ గెలిచేందుకు అవకాశం లేదని స్పష్టంగా పేర్కొన్నాయి. ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ మార్క్ 36 స్థానాలు రావాలి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీలో ఆప్‌కు ఒక్క `కేకే` సర్వే మాత్రమే 39 స్థానాలు ఇవ్వగా.. ఇతర సంస్థలు.. 30 లోపే కట్టబెట్టాయి
అయితే.. అద్భుతాలు జరిగితే మాత్రం ఆప్ విజయం దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, ప్రస్తుతం వచ్చిన ఎగ్జిట్ అంచనాల ప్రకారం.. ఆప్ వెనుకబడిందనే చెప్పాలి. ఇది ప్రాథమిక.. ఫలితం మాత్రమే. అయితే.. ఇలా ఎందుకు జరిగింది? ఆప్ ఒకవేళ ఇదే ఫలితాన్ని పొందితే.. దీనివెనుక ఉన్న కారణాలు ఏంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. దీనికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవే ఆప్‌కు ప్రజల్లో వ్యతిరేకతను పెంచి ఉంటాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే.. ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఈ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు.