దుబాయ్ 24 హెచ్ కార్ రేసింగ్(Dubai Car Racing)లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) కు చెందిన టీమ్ మూడోస్థానం(Third Place)లో నిలిచింది. రేసులో మూడో స్థానం సాధించాక ఆనందంతో అజిత్ జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ అభినందనలు తెలిపారు. అజిత్ విజయంతో కూడిన ఫోటోలను ట్వీట్ చేశారు.
అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్ కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్ లో విజయం సాధించడంతో అభిమానుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల దుబాయ్ కారు రేసింగ్ కు ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కుమార్ కు పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్ ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు అజిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద వీడియో వైరల్ గా మారగా..తమ అభిమాన హీరో ప్రమాదం నుంచి క్షేమంగాబయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు కార్ రేసింగ్ గురించి అజిత్ మాట్లాడుతూ రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్ పాల్గొంటానని వీడియోను రిలీజ్ చేశారు.
మోటార్ స్పోర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్లను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. రేసింగ్ కూడా సినిమా పరిశ్రమ లాంటిదని.. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెట్టి సమిష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
అజిత్ ప్రస్తుతం విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మగిళ తిరుమేని దర్శకత్వం వహించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న అనూహ్యాంగా వాయిదా పడింది.
అజిత్ మైత్రి మూవీ మేకర్స్ తోనూ సినిమా చేస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించినన మేకర్స్ తర్వాతా విడుదలను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అజిత్ దుబాయ్ కార్ రేసింగ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.