మండుటెండల్లో చల్లని ఊరట… చేర్యాలలో చలివేంద్రం ఏర్పాటు

15 ఏళ్లుగా పవనసుత భజన మండలి నిరంతర సేవ. - చేర్యాలలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సిఐ బానోతు రమేష్ నాయక్

Siddipet Bureau
1 Min Read

చేర్యాల, ఏప్రిల్ 3(ప్రజాజ్యోతి): చేర్యాల పట్టణ కేంద్రంలో మానవత్వమే పరమావధిగా పవనసుత భజన మండలి ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా నిరంతరాయంగా వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఈ మండలి, ఈ ఏడాది కూడా పట్టణ కేంద్రంలోని వీరభద్ర కళామందిర్ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని చేర్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బానోతు రమేష్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ.. “ఎండలు మండుతున్న ఈ సమయంలో బాటసారులకు, పాఠశాల విద్యార్థులకు చల్లని నీరు అందించడం గొప్ప విషయమని ,పవనసుత భజన మండలి సభ్యులు చేస్తున్న ఈ స్వచ్ఛంద సేవ సమాజానికి ఆదర్శప్రాయం” అని కొనియాడారు.గత 15 ఏళ్లుగా వరుసగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చలివేంద్రంలో శుద్ధమైన తాగునీరు మరియు ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులు కల్పిస్తున్నామని,వేసవి కాలం ముగిసే వరకు ఈ కేంద్రం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని,ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటామని మండలి సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పవనసుత భజన మండలి సభ్యులు, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *