నిరుద్యోగులకు జాబ్ మేళా
కామారెడ్డి ప్రతినిధి ఏప్రిల్ 3 (ప్రజా జ్యోతి)
ప్రభుత్వ జూనియర్ కళాశాల కామారెడ్డిలో సోమవారము అనగా ఆరవ తేదీన ఉదయం 9 నుంచి ఒకటి గంటల వరకు ఎంఎస్ఎన్ ఫార్మా వారి సౌజన్యంతో కళాశాల ఆవరణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి మరియు ఇటీవల పరీక్ష పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును అని కళాశాల ప్రిన్సిపల్ జయకుమారి తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
