పోలీసులు వర్సెస్ గ్రామస్తులు: జల్లి గ్రామంలో అట్రాసిటీ సెగ..!!

Warangal Bureau
2 Min Read

పోలీసులు వర్సెస్ గ్రామస్తులు: జల్లి గ్రామంలో అట్రాసిటీ సెగ!

చట్టం అధికార పార్టికి చుట్టమైందా..? లేక రాజకీయ కక్షసాధింపా?

తెరపై లేని వ్యక్తిపై కేసులేంటి? – మాజీ ఎంపీపీ జక్కా అశోక్‌ను ఏ-1గా చేర్చడంలో కుట్రదరులెవరు

ఈ అక్రమ కేసు వెనుక దాగి ఉన్న రాజకీయ పెద్దలు ఎవరు?

చెన్నారావుపేట మార్చి 28 (ప్రజా జ్యోతి)::

న్యాయం చేయాల్సిన రక్షక భటులే భక్షకులుగా మారుతున్నారా? అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా వాడుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు మండల ప్రజలు జల్లి గ్రామస్తులు దొంతర బోయిన కొమ్మాలు మరియు ఆయన కుమారులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఇప్పుడు మండలంలో తీవ్ర దుమారం రేపుతోంది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడం ఉద్రిక్తతకు దారితీసింది.

అసలేం జరిగింది?

జల్లి గ్రామానికి చెందిన దొంతర బోయిన కొమ్మాలు, ఆయన కుమారులను పోలీసులు అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ అరెస్టుల వెనుక రాజకీయ పలుకుబడితో పోలీసుల హస్తం ఉందని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి వారిని ఇరికించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే తప్పుడు మార్గాల్లో వెళ్లడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

సినిమాలో లేని పాత్రకు ‘మెయిన్ విలన్’ రోల్?

ఈ ఉదంతంలో అసలైన ట్విస్ట్ ఏమిటంటే.. మాజీ ఎంపీపీ జక్కా అశోక్ వ్యవహారం. సదరు ఘటనతో కానీ, ధర్నాతో కానీ అశోక్‌కు ఎటువంటి సంబంధం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ఘటనా స్థలంలో లేకపోయినప్పటికీ, కేవలం రాజకీయ ప్రొద్బలంతోనే పోలీసులు ఆయనను ఈ కేసులో ఏ-1 గా చేర్చారని పలువురు ఆరోపిస్తున్నారు. సినిమా స్క్రిప్టును తలపించేలా తెరపై లేని వ్యక్తిని ప్రధాన నిందితుడిగా చూపించడం వెనుక ఉన్న మర్మమేమిటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.చట్టం ఎవరికీ చుట్టం కాదనేది నానుడి.. కానీ ఇక్కడ చట్టం రాజకీయాలకు చుట్టంగా మారిందా? అనే అనుమానం కలుగుతోంది!

ఉన్నతాధికారుల విచారణ కోరుతున్న ప్రజలు

పోలీసులు పూర్తి ఆధారాలతోనే జక్కా అశోక్‌పై కేసు నమోదు చేశారా? లేక పైస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. న్యాయం బ్రతికి ఉందా లేక రాజకీయాలకు లొంగిపోయిందా అని మండల వ్యాప్తంగా ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలైన దోషులపై చర్యలు తీసుకోవాలని, రాజకీయ కక్షసాధింపు చర్యలను ఆపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *