సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం

Kamareddy
2 Min Read

సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం

రామారెడ్డి మార్చ్ 27 (ప్రజా జ్యోతి)

శ్రీరామ నవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామికి, అమ్మవారికి శాస్త్రోక్తంగా నిర్వహించే పవిత్ర వివాహ మహోత్సవం.ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో విష్ణు మూర్తి వెలసిన చోట భక్తులు లోక కల్యాణం కోసం, తమ ఇంట్లో సుఖశాంతులు కలగాలని ఈ వేడుకను ఎంతో భక్తితో నిర్వహిస్తారు.’తిరు’ అంటే పవిత్రమైన లేదా లక్ష్మీప్రదమైన అని ‘కళ్యాణం’ అంటే శుభకార్యం లేదా వివాహం.తిరుమలలో శ్రీవారి కళ్యాణం, భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం, మధురైలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం వంటివి,దైవ దంపతుల అనుగ్రహం పొందేందుకు, సమాజంలో శాంతి నెలకొనేందుకు మరియు వివాహ దోషాలు తొలగిపోవాలని భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు.ఇందులో మామూలు పెళ్లిళ్ల లాగే ఎదురుకోలు, కన్యాదానం, మాంగల్య ధారణ వంటి అన్ని వేద మంత్రాల సాక్షిగా జరుగుతాయి. ఈ సందర్భంగా రామారెడ్డి గ్రామంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రలు శ్రీ సీతారామచంద్రస్వామి, రాజరాజేశ్వర ఉభయ ఆలయాల లో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరామనవమి వేడుకలలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఆలయ ప్రాంగణంలోని మండపంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ముత్యాల పందిరి లో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. చూడముచ్చటగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తలంబ్రాలను ఒంగోలు ప్రసాద్ వారి కుటుంబ సమేతంగా స్వామివారికి సమర్పించారు.తదుపరి స్వామివారిని కళ్యాణ వేదికకు ఎదుర్కొల్లు రథాల గైన్ నుండి సాంప్రదాయబద్ధంగా స్వామివారిని గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ పట్టువస్తాలు స్వామివారికి అందజేయడం జరిగింది. అలంకరించి పల్లకి సేవలో బాజా భజంత్రీల వాయిద్యాలతో సౌండ్ సిస్టం ద్వారా అంగరంగ వైభవంగా స్వామి వారిని కళ్యాణ వేదికు తీసుకురావడం జరిగింది. తదుపరి వేద పండితులు నెమలి అభిలాష్ శర్మ, నెమలి రాధా కిషన్ శర్మ ఆధ్వర్యంలో వివిధ వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణ తో స్వామివారి కళ్యాణాన్ని కన్నుల విందుగా జరిపించారు.ఈ కళ్యాణాన్ని భక్తులు, ప్రజలు, తిలకించి పరవశించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలలో సుమారు 100కు పైగా జంటలు పాల్గొన్నారు.

ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు..!

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ,…!

శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, ఎల్లారెడ్డి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.తదుపరి ఈ యొక్క కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు , ఉత్సవ కమిటీ సభ్యులు అదేవిధంగా స్వచ్ఛంద సేవకులు వివేకానంద ట్రస్ట్ సభ్యులు, శివరామ భజన మండలి సభ్యులు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు, వైద్య సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, యువజన సంఘాల నాయకులు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొని శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *