ఉభయ ఆలయాల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
రామారెడ్డి మార్చ్ 25 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగారం. శ్రీ సీతారామచంద్రస్వామి పార్వతీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కు ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది. ఉభయ ఆలయాలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల విందుగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆలయంలోని అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికిన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ బండి ప్రవీణ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుశనోల్ల రమేష్ , మాజీ సర్పంచ్ సంజీవ్, ఏఎంసీ డైరెక్టర్ రావుఫ్, టౌన్ అధ్యక్షుడు నామాల రవి, ఉపాధ్యక్షుడు కామారెడ్డి రవి గౌడ్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
