డీవీఆర్ ధర్మకాంట ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

Warangal Bureau
1 Min Read

డీవీఆర్ ధర్మకాంట ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

దామెర, మార్చి 25 (ప్రజాజ్యోతి):

హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట గ్రామ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన డీవీఆర్ ధర్మకాంటను బుధవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు, వ్యాపారులకు ధర్మకాంట ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాలు పెరగడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల తూకం ప్రక్రియ సులభతరం అవుతుందని అన్నారు. స్థానిక ప్రజలు, రైతులు ఈ ధర్మకాంటను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ధర్మకాంట ఏర్పాటుచేసిన నిర్వాహకులకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ ధర్మకాంట యజమాని గండు దివాకర్, గండు రామకృష్ణ, జాకీర్ అలీ, కోనాటి సునీల్ రెడ్డి, కాంతాల కేశవరెడ్డి, కన్నెబోయిన రమేష్, కూనాటి రామకృష్ణా రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *