డ్యామ్ బ్యాక్‌వాటర్స్‌లో గుర్తు తెలియని మృతదేహం కలకలం

1 Min Read
Oplus_131072

వెల్దుర్తి -మసాయిపేట మార్చ్ 24:మెదక్ జిల్లా మసాయిపేట మండలం హకీంపేట్ గ్రామ పరిధిలోని గోపాలకృష్ణపురం సమీపంలోని హల్దీ వాగు డ్యామ్ బ్యాక్‌వాటర్స్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు.ఈ ఘటనపై వెల్దుర్తి ఎస్ఐ రాజు వివరాలు తెలియజేస్తూ, మృతుడి వివరాలు ఇంకా గుర్తించలేకపోయామని తెలిపారు.మృతదేహం గుర్తింపునకు సంబంధించి స్థానిక ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.ఎవరైనా తమకు తెలిసిన సమాచారం ఉంటే వెంటనే 8712657931,8712657890 పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *