అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత

Bharath Goud
0 Min Read
  • నర్సాపూర్’లో ఉద్రిక్తత 
  • లారీ అద్దాలు ధ్వంసం, డ్రైవర్లకు దేహశుద్ధి

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) తూప్రాన్ వైపు నుండి అక్రమంగా తరలిస్తున్న 3 లారీలలోని సుమారు వంద గోవులను నర్సాపూర్ పట్టణ కేంద్రంలో బుధవారం గో రక్షకులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారంతో అంబెడ్కర్ చౌరస్తా వద్ద మూడు లారీలను నిలిపివేసి, లారీ అద్దాలను ధ్వంసం చేశారు. పారిపోయేందుకు యత్నించిన డ్రైవర్లకు దేహశుద్ధి చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీలను స్వాధీనం చేసుకునీ దర్యాప్తు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *