కాపర్ వైర్ దొంగల అడ్డగింత ఇనుపరాడుతో దాడి
కామారెడ్డి ప్రతినిధి మార్చ్ 04 (ప్రజా జ్యోతి)
కామారెడ్డి పట్టణ కేంద్రంలో కొందరు దుండగులు
రాత్రి 11 గంటల సమయంలో నలుగురు దొంగలు కాపర్ వైర్ దొంగిలించుకుని వెళుచుండగా గొల్లవాడ సమీపంలో అనుమానస్పదంగా కనిపించగా రాజేష్ వినోద్ అశోక్ అను వారు వారిని అనుమానాస్పదంగా ఆపడం జరిగింది.ఏమి తీసుకెళ్తున్నారు అని అడగగా తమతో పాటుగా తీసుకొని వచ్చినా ముందుగా పథకం ప్రకారం తీసుకొని వచ్చినా ఇనుపరాడు మరియు కర్రలతో వారిపై దాడి చేసి తలకు తీవ్ర గాయాలు చేసినారు.తర్వాత పోలీసు వారికి సమాచారం అందగానే సంఘటన వద్దకు వెళ్లి కాపర్ వైర్ తో పాటుగా నిందితులు నవీద్,ఇజాస్, వసీం మరియు హజారుద్దీన్ అను నలుగురు నిందితులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.
