14 వ వార్డు కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్
చేవెళ్ల ప్రజా జ్యోతి

చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్ స్పష్టం చేశారు. వార్డు అధికారితో కలిసి ఆయన సోమవారం పర్యటించి, స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ మరియు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వార్డు ప్రజలు కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన, డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయించడంతో పాటు, పాత బోర్లకు మరమ్మతులు మరియు ఫ్లషింగ్ చేయిస్తామని హామీ ఇచ్చారు. వార్డులో ఎవరికైనా ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వార్డులో సమస్యలను దశలవారీగా పరిష్కరించి 14 వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాములు, మాజీ వార్డు సభ్యులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
