చేర్యాలలో మధ్యాహ్నం 3 గంటలవరకు పోలింగ్ 76.27 శాతం నమోదు
చేర్యాల ఫిబ్రవరి 11(ప్రజాజ్యోతి):చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొంటున్నారు.చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో12 వార్డులు, 24 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 13777 మంది ఓటర్లు ఉన్నారు.వీరిలో పురుషులు 6658 మంది,మహిళలు 7119 మంది ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలవరకు మొత్తంగా 10508 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.వీరిలో పురుషులు 5022 మంది,మహిళలు 5486 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 76.27 పోలింగ్ శాతం నమోదయ్యింది
