ఉప్పల్‌లో కబ్జాదారులకు హైడ్రా షాక్.. రూ.85 కోట్ల పార్కు స్థలాలు స్వాధీనం

V. Sai Krishna Reddy
1 Min Read

ఉప్పల్ మండలంలో కబ్జాకు గురైన విలువైన పార్కు స్థలాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో సుమారు రూ.85 కోట్ల విలువ చేసే 7వేల గజాల పార్కు భూములను కాపాడారు. స్థానికులు ప్రజావాణి కార్యక్రమంలో చేసిన ఫిర్యాదుల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

1980లో వేసిన బాబానగర్ కాలనీ లేఅవుట్‌లో 3వేల గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే కాలక్రమేణా ఈ స్థలాన్ని కొందరు అక్రమంగా 500 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి విక్రయించారు. దీనిపై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, అసలు లేఅవుట్ పత్రాలను ధ్రువీకరించుకున్నారు. ఇప్పటికే కొంత భాగంలో నిర్మాణాలు జరగడంతో, మిగిలిన 2వేల గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు. ఇది పార్కు స్థలమని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.

ఇదే తరహాలో, ఉప్పల్ మండలం నాచారంలోని కార్తికేయ నగర్‌లో కూడా పార్కు కోసం కేటాయించిన 5వేల గజాల స్థలాన్ని అధికారులు కాపాడారు. ఈ రెండు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న భూముల మొత్తం విలువ రూ.85 కోట్లుగా అంచనా వేశారు. ప్రభుత్వ భూములను కాపాడిన హైడ్రా అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *